Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రైల్లో నుంచి జారిపడ్డ పసికందు... మృత్యుంజయురాలే!

ఆ పసికందు రైల్లో నుంచి జారి పడింది. భూమిపై ఆ పాప చేయాల్సిన కార్యాలేవో ఇంకా మిగిలి ఉన్నాయేమో! ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడింది. ఈ ఘటన అనంతపురం రైల్వే స్టేషన్లో జరిగింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలు నుంచి పాప కింద పడినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు రాకపోవడంతో పాపను అధికారులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పాప ప్రమాదవశాత్తూ కిందపడిందా? లేక ఎవరైనా కావాలనే జారవిడిచారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News